అన్న క్యాంటీన్ నిర్వహణ భేష్
ABN , First Publish Date - 2023-05-02T01:04:01+05:30 IST
పట్టణంలో అన్న క్యాంటీన్ నిర్వహణ బాగుందని టీడీపీ నేతలు బుద్ద నాగ జగదీష్, పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు నిర్వాహకులను అభినందించారు.
ఎలమంచిలి, మే 1: పట్టణంలో అన్న క్యాంటీన్ నిర్వహణ బాగుందని టీడీపీ నేతలు బుద్ద నాగ జగదీష్, పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు నిర్వాహకులను అభినందించారు. పట్టణంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌కు సోమవారం నాటికి 90 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేతలు అన్న క్యాంటీన్‌లో పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఎన్నారై టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నక్యాంటీన్‌లో ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆడారి ఆదిమూర్తి, గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, బొద్దపు శ్రీను పాల్గొన్నారు.