రాష్ట్రాభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2023-10-09T00:37:09+05:30 IST

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

రాష్ట్రాభివృద్ధే ధ్యేయం
మర్రివలసలో సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, తదితరులు

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

కె.కోటపాడు, అక్టోబరు 8: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మర్రివలసలో సచివాలయ భవనం, వెల్‌నెస్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రం, ఇంటింటికి మంచినీటి కుళాయిలను అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. స్థానిక ఎంపీపీ రెడ్డి జగన్‌మోహ న్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో గ్రామాలు అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తన హయాంలో మాడుగుల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను, ప్రభుత్వ ఐటీఐని మంజూరు చేయాలని జవహర్‌లాల్‌ నెహ్రూ ఐటీఐ ప్రిన్సిపాల్‌ మేడిశెట్టి ఈశ్వరరావు, టీచర్స్‌ అసోసియేషన్‌ తరఫున కె.ఈశ్వరరావు, ఎం.సింహాచలం, కె.శివ, తదితరులు వారిని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-09T00:37:09+05:30 IST