వడ్డాది హైస్కూల్‌ నిర్వహణ అధ్వానం

ABN , First Publish Date - 2023-03-03T01:16:14+05:30 IST

మండలంలోని వడ్డాది జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుల పనితీరుపై డిప్యూటీ డీఈఓ ఎం.ప్రేమ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం స్కూల్‌ని తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడి, విద్యా ప్రమాణాలను పరిశీలించారు.

వడ్డాది హైస్కూల్‌ నిర్వహణ అధ్వానం
పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నిస్తున్న డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌

టీచర్ల పనితీరుపై డిప్యూటీ డీఈవో అసంతృప్తి

ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ

బుచ్చెయ్యపేట, మార్చి 2: మండలంలోని వడ్డాది జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుల పనితీరుపై డిప్యూటీ డీఈఓ ఎం.ప్రేమ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం స్కూల్‌ని తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడి, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పలు సబ్జెక్టులపై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదంటూ హెచ్‌ఎం శేషగిరిని మందలించారు. పాఠాలు సరిగా బోధించని ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్‌, విజయరామరాజుపేట, తురకలపూడి, సీతయ్యపేట పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-03T01:16:14+05:30 IST