పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-03-17T00:10:28+05:30 IST
పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
పాడేరు, మార్చి16(ఆంధ్ర జ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు జయంతిని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ సుమిత్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవో రోణంకి గోపాలకృష్ణ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి చిన్నికృష్ణ, ఐటీడీఏ ఏపీవో వీఎస్ ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ కె.లావణ్యకుమార్, కలెక్టరేట్, ఐటీడీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.