ముఖ హాజరు నుంచి వీఆర్‌ఏలను మినహాయించాలి

ABN , First Publish Date - 2023-02-15T00:31:08+05:30 IST

ముఖ హాజరు నుంచి వీఆర్‌ఏలకు మినహాయింపు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు కంచెల రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

ముఖ హాజరు నుంచి వీఆర్‌ఏలను మినహాయించాలి
డీఆర్‌వో వెంకటరమణకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

కె.కోటపాడు, ఫిబ్రవరి 14: ముఖ హాజరు నుంచి వీఆర్‌ఏలకు మినహాయింపు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు కంచెల రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా కమిటీ ప్రతినిధులతో అనకాపల్లి డీఆర్‌వో వెంకటరమణకు వినతిపత్రం అందజేశామన్నారు. రూ.26 వేలు పే స్కేలు అమలు చేయాలని, పాత డీఏను జీతాలతో కలిపి చెల్లించాలని, నామినీ వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, 65 సంవత్సరాలు వయసు పైబడి మృతి చెందిన వీఆర్‌ఏ కుటుంబాల్లో ఒకరికి 2005 జీవో ప్రకారం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి డేవిడ్‌, ఉపాధ్యక్షుడు నరేంద్ర, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్రాంతికుమారి, జిల్లా కోశాధికారి ఎన్‌.సంతోష్‌కుమార్‌, అనకాపల్లి జిల్లా గౌరవాధ్యక్షుడు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ (సీఐటీయూ), అనకాపల్లి డివిజన్‌ అధ్యక్షుడు తోటాడ సింహాచలం, కార్యదర్శి పరదేశినాయుడు, నర్సీపట్నం డివిజన్‌ అధ్యక్షుడు కార్యదర్శులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T00:31:09+05:30 IST