భారతీయ సంస్కృతి విభిన్నం

ABN , First Publish Date - 2023-02-08T01:00:52+05:30 IST

ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్ర విభిన్నంగానూ, ఉత్తమమైనదిగా తాను భావిస్తున్నానని అమెరికా బ్రిగం యూనివర్శిటీ ప్రొఫెసర్‌ చార్లెస్‌ నికోలస్‌ అన్నారు.

భారతీయ సంస్కృతి విభిన్నం
సమావేశంలో మాట్లాడుతున్న అమెరికన్‌ ప్రొఫెసర్‌ నికోలస్‌

చోడవరం, ఫిబ్రవరి 7: ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్ర విభిన్నంగానూ, ఉత్తమమైనదిగా తాను భావిస్తున్నానని అమెరికా బ్రిగం యూనివర్శిటీ ప్రొఫెసర్‌ చార్లెస్‌ నికోలస్‌ అన్నారు. దేశ సంస్కృతి పరిశోధన కోసం ఇండియాకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భారతీయ సంస్కృతి చాలా ఉన్నత విలువలతో కూడుకున్నదని ప్రశంసించారు. ఈ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత యువతరానిదేనన్నారు. గౌరవ అతిథి పూర్వ వీసీ ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ, దేశ సంస్కృతి గురించి ఇతర దేశాల మేధావుల వ్యాఖ్యలు విన్న తరువాత మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో అందరూ గ్రహించాలన్నారు. విదేశీ వ్యామోహంలో పడవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిరణ్‌, సమన్వయకర్త జీవీఎస్‌ ప్రసాద్‌, లెక్చరర్లు రఫియుద్దీన్‌, సత్యనారాయణ, మాల్యాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-08T01:00:53+05:30 IST