ఘాట్‌ మార్గంలో హెచ్చరిక బోర్డులు ధ్వంసం

ABN , First Publish Date - 2023-07-05T01:03:00+05:30 IST

స్థానిక ఘాట్‌ మార్గంలో ప్రమాదాల నివారణకు పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులకు ఆకతాయిల బెడద తప్పడం లేదు. దీంతో అక్కడక్కడ వాటిని ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు. పాడేరు జిల్లా కేంద్రం అయిన తరువాత ఘాట్‌ మార్గంలో వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు ఘాట్‌లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

 ఘాట్‌ మార్గంలో హెచ్చరిక బోర్డులు ధ్వంసం
ఘాట్‌లోని రాజాపురం సమీపంలో నేలకొరిగిన హెచ్చరిక బోర్డు

- ఆకతాయిల చర్యలతో నేలకొరిగిన వైనం

- పర్యాటకులు, వాహనాల డ్రైవర్లకు తప్పని ఇబ్బందులు

పాడేరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్థానిక ఘాట్‌ మార్గంలో ప్రమాదాల నివారణకు పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులకు ఆకతాయిల బెడద తప్పడం లేదు. దీంతో అక్కడక్కడ వాటిని ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు. పాడేరు జిల్లా కేంద్రం అయిన తరువాత ఘాట్‌ మార్గంలో వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు ఘాట్‌లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రమాదకరమైన మలుపులు, ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రదేశాల్లో వాహన చోదకులు మరింత అప్రమత్తంగా డ్రైవింగ్‌ చేసేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో ఘాట్‌ మార్గంలో డ్రైవింగ్‌ చేసే కొత్త వాళ్లు సైతం అప్రమత్తమై ప్రమాదాలకు గురికాకుండా ఉంటారనేది పోలీసుల ఆలోచన. హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతో చాలా వరకు ప్రమాదాలు తగ్గాయి. కాగా పలువురు ఆకతాయిలు ఘాట్‌లోని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం సమీపంలోని హెచ్చరికల బోర్డుల సపోర్టింగ్‌ పైపులను విరగొట్టడడంతో అవి నేలకొరిగాయి. ఘాట్‌లో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉండాలని ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను పాడు చేయడం ఏమిటని ప్రయాణికులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హెచ్చరికల బోర్డులను ధ్వంసం చేయవద్దని పలువురు కోరుతుండగా, అటువంటి ఆకతాయి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని మరికొందరు వేడుకొంటున్నారు.

Updated Date - 2023-07-05T01:03:00+05:30 IST