జగన్‌ ఎవరి భవిష్యత్తు, ఎవరికి నమ్మకం

ABN , First Publish Date - 2023-04-15T01:08:02+05:30 IST

బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం చేసి ఆదివాసీ భావితరాల వినాశనానికి పునాదులు వేసిన జగన్‌ ఎవరి భవిష్యత్తు, ఎవరికి నమ్మకమో...గిరిజన శాసన సభ్యులు, ఎంపీ సమాధానం చెప్పాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మొట్టడం రాజబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆదివాసీ జేఏసీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహించిన నిరసన శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గిరిజనులకు జగన్‌ మేలు చేస్తాడనే నమ్మకం తమకు లేదని, తమ భవిష్యత్తు ఏమిటో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

జగన్‌ ఎవరి భవిష్యత్తు, ఎవరికి నమ్మకం
శిబిరంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మొట్టడం రాజబాబు

గిరిజన ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలి

పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌

గిరిజనులకు మేలు చేస్తారనే నమ్మకం లేదు...వచ్చే ఎన్నికల్లో తేల్చుకుంటాం

ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ మొట్టడం రాజబాబు

బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం

చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా), ఏప్రిల్‌ 14: బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం చేసి ఆదివాసీ భావితరాల వినాశనానికి పునాదులు వేసిన జగన్‌ ఎవరి భవిష్యత్తు, ఎవరికి నమ్మకమో...గిరిజన శాసన సభ్యులు, ఎంపీ సమాధానం చెప్పాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మొట్టడం రాజబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆదివాసీ జేఏసీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహించిన నిరసన శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గిరిజనులకు జగన్‌ మేలు చేస్తాడనే నమ్మకం తమకు లేదని, తమ భవిష్యత్తు ఏమిటో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టంచేశారు. గిరిజనులకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో నంబర్‌ 3ను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాజాగా రాజకీయ లబ్ధి కోసం ఆదివాసీలను బలి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ తక్షణమే పదవులకు రాజీనామా చేసి ఆదివాసీలతో కలిసి ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాఽద్యక్షుడు బోండ్ల చిరంజీవి, ఆదివాసీ జేఏసీ నాయకుడు లోచలి రామకృష్ణ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం మండలాధ్యక్షుడు బౌడు గంగరాజు, నాయకులు దేపూరి శశికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కంకిపాటి వీరన్నపడాల్‌, కొర్ర సూరిబాబు, లకే వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-15T01:08:02+05:30 IST