గాలి, వాన బీభత్సం

ABN , First Publish Date - 2023-04-30T01:13:51+05:30 IST

కోటవురట్ల ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. వడగళ్ల వాన పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. మేఘాలు దట్టంగా అలుముకుని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షం కారణంగా మిరప, నిమ్మ, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తంగేడు వద్ద చెట్టుకొమ్మ విద్యుత్‌ తీగలపై పడడంతో ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రహదారులు జలమయ మయ్యాయి. రాట్నాపాలెంలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో ఒక ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కోటవురట్ల నుంచి గొట్టివాడ వరకు ప్రధాన రహదారిలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

గాలి, వాన బీభత్సం
కోటవురట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద నిలిచిపోయిన వర్షపునీరు

- వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం

- నేలరాలిన నిమ్మ, మామిడికాయలు

- చెట్ల కొమ్మలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం

- విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

కోటవురట్ల, ఏప్రిల్‌ 29: కోటవురట్ల ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. వడగళ్ల వాన పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ కాయగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. మేఘాలు దట్టంగా అలుముకుని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షం కారణంగా మిరప, నిమ్మ, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తంగేడు వద్ద చెట్టుకొమ్మ విద్యుత్‌ తీగలపై పడడంతో ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రహదారులు జలమయ మయ్యాయి. రాట్నాపాలెంలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో ఒక ఆటో, కారు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కోటవురట్ల నుంచి గొట్టివాడ వరకు ప్రధాన రహదారిలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2023-04-30T01:13:51+05:30 IST