మద్యం దుకాణాల్లో అన్నీ జె బ్రాండ్సే
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:32 PM
ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. మద్యం దుకాణాల్లో అన్నీ జెబ్రాండ్సే విక్రయిస్తున్నారని ఆరోపించారు.
మద్యం దుకాణాల్లో అన్నీ జె బ్రాండ్సే
ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు
విజయనగరం రూరల్, డిసెంబరు 28: ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. మద్యం దుకాణాల్లో అన్నీ జెబ్రాండ్సే విక్రయిస్తున్నారని ఆరోపించారు. బీసీ సంఘం నేత గదుల వెంకటరావు ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు కలిపి 300 మంది అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో గురువారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం నాణ్యత లేనిదని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగం నిర్వీర్యం అయిందన్నారు. విద్యారంగం కూడా బాగాలేదని, బడులు ఎత్తేయడంతో రాష్ట్రంలో 8 లక్షల మంది బాలబాలికలు బడి బయట ఉండాల్సి వచ్చిందన్నారు. టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. టీడీపీలో చేరిన బీసీ నాయకుడు గదుల వెంకటరావు, చోడి ఆదినారాయణ, దిమిలి పైడిరాజు, కుందేటి పార్వతీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలు నచ్చి చేరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి టీడీపీతోటే సాధ్యమని నమ్మామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాదుల కనకమహాలక్ష్మీ, ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, విజ్జపు ప్రసాద్, కనకల మురళీమోహన్, కర్రోతు వెంకట నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.