ఆకట్టుకున్న ఆనందో బ్రహ్మ
ABN , First Publish Date - 2023-07-17T00:04:35+05:30 IST
స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియంలో ప్రతి నెలా జరిగే ఆనందో బ్రహ్మ కార్య క్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన పలు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
బొబ్బిలి, జూలై 16: స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియంలో ప్రతి నెలా జరిగే ఆనందో బ్రహ్మ కార్య క్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన పలు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డ్యాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు డ్యాన్స్, మహిళా బృంద హరివిల్లు, డీవీ అప్పారావు బృందంచే సినీ గీతాలాపన, రంగరాయపురం ఎంపీయూపీ పాఠశాల విద్యార్థుల కాస్కో-కాస్కో, పల్లెదరువు, తాడుతూరి వెంకటరమణ బృందంచే ప్రతిఘటన సినిమాలో సన్నివేశాలు, విజయ మోహన్ విహారి నటించిన రాజకీయ స్కిట్, తైక్వాండో ప్రదర్శనలు, గంగాధర్ మాస్టా రి కామెడీ సీన్‌లు, కునుకువానివలస మహిళల కోలాటం, కృష్ణవేణి నృత్యాలయం విద్యార్థుల నాట్య ప్రదర్శన వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు మింది విజయమోహన్, నాగరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.