టీడీపీ పార్వతీపురం ఇన్‌చార్జిగా బోనెల విజయచంద్ర
ABN , First Publish Date - 2023-07-27T23:53:38+05:30 IST
జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు.
పార్వతీపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నర్సిపురం గ్రామానికి చెందిన బోనెల విజయచంద్రను నియమించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకు చిరంజీవులు ఇన్‌చార్జిగా ఉండేవారు.