జిల్లాకు చిల్డ్రన్‌ హోమ్‌ మంజూరు

ABN , First Publish Date - 2023-04-14T00:20:24+05:30 IST

జిల్లాకు కొత్తగా చిల్డ్రన్‌ హోమ్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయగౌరి గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

జిల్లాకు చిల్డ్రన్‌ హోమ్‌ మంజూరు

పార్వతీపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కొత్తగా చిల్డ్రన్‌ హోమ్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయగౌరి గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. తమ శాఖ ఆధ్వర్యంలో ఈ హోమ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చైల్డ్‌ ప్రొటాక్షన్‌ యూనిట్లు (డీసీపీయూ), స్పెషలైజ్డ్‌ అడప్షన్‌ ఏజెన్సీలు (ఎస్‌ఏఏలు), చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు (సీడబ్య్లూసీలు), జూవైనల్‌ జస్టిస్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-04-14T00:20:24+05:30 IST