Share News

భామినిలో ఏనుగుల సంచారం

ABN , First Publish Date - 2023-11-17T23:11:36+05:30 IST

మండలంలో ఇసుకగూడ, సన్నాయిగూడలో గత కొద్దిరోజులుగా సంచరించిన నాలుగు ఏనుగులు గురువారం రాత్రి భామిని పరిసరాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం అవి సన్నాయికాలనీ సమీపంలో హల్‌చల్‌ చేస్తుండడంతో ఆ గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు.

 భామినిలో ఏనుగుల సంచారం
సన్నాయికాలనీ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

భామిని: మండలంలో ఇసుకగూడ, సన్నాయిగూడలో గత కొద్దిరోజులుగా సంచరించిన నాలుగు ఏనుగులు గురువారం రాత్రి భామిని పరిసరాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం అవి సన్నాయికాలనీ సమీపంలో హల్‌చల్‌ చేస్తుండడంతో ఆ గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శివ్వ కొండ పక్క నుంచి వచ్చిన గజరాజులు ఇప్పటికే సన్నాయికాలనీ సమీపంలో పాలక దయాలు, రమేష్‌, ఢిల్లీ తదితర రైతులకు చెందాన్ని ధాన్యాన్ని తిని నాశనం చేశాయి. పగలంతా జీడితోటల్లో ఉంటున్న ఏనుగులు సాయంత్రం అయ్యేసరికి భామిని సమీపంలో సంచరిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు రాత్రి వేళల్లో బయటకు రాలేకపోతున్నారు. సన్నాయికాలనీ, యాతంగూడ తదితర గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించే చర్యలు తీసుకోవాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-11-17T23:11:37+05:30 IST