జేజేలు దుర్గమ్మ
ABN , First Publish Date - 2023-10-19T22:47:38+05:30 IST
జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రుల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
పాలకొండ/సాలూరు రూరల్: జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రుల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, చండీయాగాలు, హోమాలతో అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా గురువారం పాలకొండలో కోటదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని మహాచండిగా అలంకరించారు. పట్టణవాసులతో పాటు పరిసర ప్రాంత భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కుంకుమపూజలు చేశారు. ఇక సాలూరులో కామాక్షి ఆలయంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. సింధూర లేపితంతో దర్శనమిచ్చిన కామాక్షీదేవిని తిలకించి భక్తులు పరవశించిపోయారు.