కొంకడివరాన్ని కాపాడండి
ABN , First Publish Date - 2023-03-11T23:53:57+05:30 IST
క్వారీల శబ్ధంతో సతమతమవుతున్న కొంకడివరం గ్రామా న్ని కాపాడాలని కోరుతూ అరకు టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్య నారాయణ, సర్పంచ్ అల్లు అప్పలనాయుడు శనివారం తహసీల్దార్ అజూ రఫీజాన్ కు వినతిపత్రం అందించారు.
గరుగుబిల్లి: క్వారీల శబ్ధంతో సతమతమవుతున్న కొంకడివరం గ్రామా న్ని కాపాడాలని కోరుతూ అరకు టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్య నారాయణ, సర్పంచ్ అల్లు అప్పలనాయుడు శనివారం తహసీల్దార్ అజూ రఫీజాన్ కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి దూరంలో ఉన్న క్వారీ నిర్వహణకుగాను గ్రామానికి ఆనుకుని రహదారి నిర్మించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఈ రహదారి నిర్మాణ సమ యంలో అడ్డుకున్నా తిరిగి ప్రతిపాదనలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొంకడివరం నుంచి పార్వతీపురం వెళ్లేందుకు గతంలో నిర్మించిన రహదారి ఇరుగ్గా తయారయ్యిందన్నారు. ఈ మార్గంలో భారీ వాహనాలు రాకపో కలు సాగించడంతో రహదారి గుంతలుగా తయారవుతుందన్నారు. ఈ మార్గం గుండా నిత్యం ప్రయాణం చేసే విద్యార్థులు, పలు గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారని చెప్పారు. గతంలో గ్రామానికి ఆనుకుని ఉన్న రెండు క్వారీలతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తదుపరి క్వారీలు నిలుపుదల చేశారని తెలిపా రు. కొంకడివరం నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి రహదారి ఏర్పాటుకు దృష్టి సారించాలన్నారు. పంచాయతీ పరిధిలో ఒకవైపు డంపింగ్ యార్డు, మరోవైపు రహ దారి ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతు న్నారన్నారు. రహదారి, డంపింగ్ యార్డు విషయంలో అధికారులు తగిన నిర్ణయం తీసుకోకుంటే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారు లకు నివేదిస్తామని తహసీల్దార్ అజూ రఫీజాన్ తెలిపారు.