210 కేజీల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2023-05-30T00:28:55+05:30 IST
శృంగవరపుకోటలో గంజాయిని రవాణా చేస్తు న్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శృంగవరపుకోట, మే 29: శృంగవరపుకోటలో గంజాయిని రవాణా చేస్తు న్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకు నుంచి ఎస్‌యూవీ 500 కారులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గంజాయిని తర లిస్తూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాహనాన్ని పట్టణంలోని స్టేషన్ రోడ్డుపై నిలిపి వేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 210 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు.