డీలర్ల సమక్షంలోనే తూకం వేయాలి: డీఎస్‌వో

ABN , First Publish Date - 2023-06-15T00:24:46+05:30 IST

అవకతవకలకు తావివ్వకుండా, తూనిక ఖచ్చితంగా ఉండేలా డీలర్ల సమక్షంలోనే సరుకలు తూనిక వేసి అందజేయాలని గోదాము ఇన్‌చార్జి, అధికారులకు డీఎస్‌వో మధుసూదనరావు సూచించారు. భోగాపురంలోని పౌర సరఫరాల గోదామును బుధవారం పరిశీలించారు. గోదాములో బియ్యం నిల్వలు, నాణ్యత, తూనిక వేసి రికార్డుల ప్రకారం ఉన్నాయా లేదా తనిఖీచేశారు. రికా ర్డులు స్థాకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాములో డీలర్లకు తక్కువ చేసి బియ్యం అందజేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీ లించినట్లు తెలిపారు.కార్యకమ్రంలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ కె.మీనాకుమారి, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.రంగారెడ్డి, విజిలెన్స్‌ సీఐ సింహాచలం, తహసీల్దార్‌ పీహెచ్‌ బంగార్రాజు, సీఎస్‌డీటీ బీవీ మురళి పాల్గొన్నారు.

డీలర్ల సమక్షంలోనే తూకం వేయాలి: డీఎస్‌వో

భోగాపురం: అవకతవకలకు తావివ్వకుండా, తూనిక ఖచ్చితంగా ఉండేలా డీలర్ల సమక్షంలోనే సరుకలు తూనిక వేసి అందజేయాలని గోదాము ఇన్‌చార్జి, అధికారులకు డీఎస్‌వో మధుసూదనరావు సూచించారు. భోగాపురంలోని పౌర సరఫరాల గోదామును బుధవారం పరిశీలించారు. గోదాములో బియ్యం నిల్వలు, నాణ్యత, తూనిక వేసి రికార్డుల ప్రకారం ఉన్నాయా లేదా తనిఖీచేశారు. రికా ర్డులు స్థాకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాములో డీలర్లకు తక్కువ చేసి బియ్యం అందజేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీ లించినట్లు తెలిపారు.కార్యకమ్రంలో పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ కె.మీనాకుమారి, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.రంగారెడ్డి, విజిలెన్స్‌ సీఐ సింహాచలం, తహసీల్దార్‌ పీహెచ్‌ బంగార్రాజు, సీఎస్‌డీటీ బీవీ మురళి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-15T00:24:46+05:30 IST