అమ్మో! రైల్వే స్టేషన్‌

ABN , First Publish Date - 2023-03-20T00:38:16+05:30 IST

చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లోకి రావాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. రెండో నంబరు ప్లాట్‌ ఫారంపైకి వెళ్లాలంటే మరీ అసౌకర్యానికి గురవుతున్నారు.

అమ్మో! రైల్వే స్టేషన్‌
లోడింగ్‌ సమయంలో స్టేషన్‌ను కమ్ముకున్న ధూళి

చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లోకి రావాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. రెండో నంబరు ప్లాట్‌ ఫారంపైకి వెళ్లాలంటే మరీ అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్‌లోని మూడో నంబరు ప్లాట్‌ ఫారం నుంచి క్వార్ట్జ్‌ ముడి సరుకును వ్యాగన్లలోకి నింపే సమయంలో విపరీతమైన దుమ్ము, ధూళి విడుదల అవుతుండడమే దీనికి కారణం. చీపురుపల్లి పరిసర ప్రాంతాల్లోని క్వార్ట్జ్‌ ముడి సరుకును సంబంధిత కాంట్రాక్టర్లు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుంటారు. ఆ సరుకును వ్యాగన్లలోకి లోడ్‌ చేసే సమయంలో విపరీతమైన ధూళి కమ్ముకుంటోంది. రెండు ప్లాట్‌ఫారాలు దుమ్ముతో నిండిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే రాత్రి వేళల్లో లోడింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని వారంతా రైల్వే అధికారులను కోరుతున్నారు.

- చీపురుపల్లి

Updated Date - 2023-03-20T00:38:16+05:30 IST