10 అడుగుల కొండచిలువ పట్టివేత
ABN , First Publish Date - 2023-11-20T00:37:04+05:30 IST
కలిదిండి మండలం సానా రుద్రవరంలో ఒక రైతు చెరువు గట్టుపై ఆదివారం సాయంత్రం పది అడుగుల కొండ చిలువ సంచరించింది.
కలిదిండి మండలం సానా రుద్రవరంలో ఒక రైతు చెరువు గట్టుపై ఆదివారం సాయంత్రం పది అడుగుల కొండ చిలువ సంచరించింది. దానిని చూసిన రైతులు అధైర్యపడకుండా గోనె సంచిలో దానిని బంధించి కలిదిండి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించగా పోలీసులు దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
–కలిదిండి