నీరు వదిలాక కాల్వ పనులా ?
ABN , First Publish Date - 2023-06-11T00:35:10+05:30 IST
ఆలస్యంగా టెండర్లు ఖరారు కావడంతోనే ఆలస్యంగానే ఓఅండ్‌ఎం ప్రాజెక్టులో చెత్త, తూడు తొలగింపు పనులు సాగుతున్నాయి. పంట కాలువలకు నీళ్లు వదిలి తరువాత ఈ పనులు చేస్తున్నారంటూ ‘ఆంధ్ర జ్యోతి’లో ఏటా ఇంతే.. శీర్షికన ప్రచురితమైన కథనానికి జలవనరులశాఖ అధికారులు స్పందించారు..
భీమవరం, జూన్ 10 : ఆలస్యంగా టెండర్లు ఖరారు కావడంతోనే ఆలస్యంగానే ఓఅండ్‌ఎం ప్రాజెక్టులో చెత్త, తూడు తొలగింపు పనులు సాగుతున్నాయి. పంట కాలువలకు నీళ్లు వదిలి తరువాత ఈ పనులు చేస్తున్నారంటూ ‘ఆంధ్ర జ్యోతి’లో ఏటా ఇంతే.. శీర్షికన ప్రచురితమైన కథనానికి జలవనరులశాఖ అధికారులు స్పందించారు.. పనులను వేగంగా పూర్తి చేస్తామని ఆదేశించారు. ఆ ప్రకారమే జిల్లాలో పంట కాలువలలో చెత్త, తూడు తొలగించే పని చేపట్టారు. ఈనెల ఒకటి రెండు తేదీలలో కాలువలకు నీరు విడిచి పెట్టడంతో గురు, శుక్రవారాల్లో గోదావరి జలాలు శివారు ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దీంతో తూడుపైకి తేలింది. వాటిని రసాయనాలతో స్ర్పే చేస్తున్నారు. జిల్లాలో పెద్ద ఇరిగేషన్ కాలువైన గోస్తనీ అండ్ వేల్పూరు (జిఅండ్‌వి కెనాల్)లో రెండు ప్యాకేజీలుగా ఈ పనులు చేపట్టారు. మాముడూరు లాక్ నుంచి దిగువ ఖాళీపట్నం వరకు ఒక ప్యాకేజీ, మాముడూరు నుంచి పైన ఒక ప్యాకేజీగా ఈ పనులు సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇలా చివరి దశలో పనులు చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు.. ఏదో విధంగా పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇంకా కొన్ని డ్రైనేజీలలో ఈ ప్యాకేజీ పనులు ప్రారంభం కావలసి ఉంది. జిల్లాలో తూడు తొలగింపునకు 20 పంట కాలువలకు రూ.7 కోట్లు,25 డ్రెయినేజీలకు రూ.6 కోట్లు వంతున ఖర్చు చేస్తున్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
నాగార్జునరావు, జలవనరులశాఖ అధికారి
జిల్లాలో మురుగు పంట కాలువలలో గుర్రపు డెక్క, తూడును తొలగిస్తున్నాం. బొండాడ డ్రెయి న్‌లో కూడా పనులు సాగుతున్నాయి. రసాయ నాలు స్ర్పే చేసిన తరువాత మనుషులతో తూడు తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.