Chandrababu: అర్థరహితంగా కేసులు పెడుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-08-07T12:08:32+05:30 IST

అమరావతి: పుంగనూరు-తంబళ్లపల్లే ఘటనల్లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఏలూరులో చంద్రబాబును కలిసిన......

Chandrababu: అర్థరహితంగా కేసులు పెడుతున్న పోలీసులు

అమరావతి: పుంగనూరు (Punganur)-తంబళ్లపల్లే (Tambalapalle) ఘటనల్లో టీడీపీ నేతల (TDP Leaders)పై పోలీసులు అక్రమ కేసులు (Illegal Cases) నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సీరియస్ (Serious) అయ్యారు. పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఏలూరులో చంద్రబాబును కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు చెప్పారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేశారన్నారు.

కాగా పుంగనూరు ఘటనలో ఐదు ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన 60 మంది ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-07T12:08:32+05:30 IST