భోళా శంకర్ టీజర్ సందడి
ABN , First Publish Date - 2023-06-24T23:31:38+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి నటించిన 154వ చిత్రం భోళా శంకర్ చిత్రం టీజర్ లాంచింగ్ కార్యక్రమం భీమవరం పద్మాలయ ధియేట ర్‌లో శనివారం సాయంత్రం జరిగింది.
భీమవరం అర్బన్, జూన్ 24: మెగాస్టార్ చిరంజీవి నటించిన 154వ చిత్రం భోళా శంకర్ చిత్రం టీజర్ లాంచింగ్ కార్యక్రమం భీమవరం పద్మాలయ ధియేట ర్‌లో శనివారం సాయంత్రం జరిగింది. టౌన్ వైడ్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చల్లా రాము, పద్మాలయ ధియేటర్ అధినేత దాట్ల రామకృష్ణంరాజు కేకును కట్ చేసి అభిమానులకు అందించారు. ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘసేవకులు అల్లు శ్రీనివాస్, యాసా అనిల్, యాతం స్వామి, కొప్పర్తి కోటి, ఆకుల జయ, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.