ఇటు బాబు అటు జగన్‌

ABN , First Publish Date - 2023-08-07T00:41:21+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సోమవా రం పోలవరం నియోజకవర్గంలో వేర్వేరుగా పర్యటించను న్నారు.

	ఇటు బాబు అటు జగన్‌

నేడు పోలవరం నియోజకవర్గంలో పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు

గొమ్ముగూడెంలో సీఎం..

వరద బాధితులతో ముఖాముఖి..

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై బాబు యుద్ధభేరి.. పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌.. దేవరపల్లిలో బహిరంగ సభ

ఏలూరు/కుక్కునూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):సీఎం వైఎస్‌ జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సోమవా రం పోలవరం నియోజకవర్గంలో వేర్వేరుగా పర్యటించను న్నారు. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు జగన్‌ కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వస్తుండగా, ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు రానున్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలూ ఒకే రోజు ఒకే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో పొలిటికల్‌గా హై అలెర్ట్‌ కనిపిస్తోంది. మరోవైపు పోలవరం ఏజెన్సీ ప్రాంతం కావడంతో తెలుగు దేశం, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్న నేప థ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. సీఎం కోసం గొమ్ముగూడెంలో హెలీప్యాడ్‌ ఏర్పాటుచేశారు. యంత్రాంగ మంతా గ్రామంలోనే ఉండి పర్యవేక్షిస్తోంది. వెయ్యి మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామానికి చుట్టుప క్కల దాదాపు ఐదు కిలోమీటర్ల ముందు నుంచే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సీఎంకు నిర్వాసితుల సమస్యలను విన్నవించ నున్నారు. జేసీ బి.లావణ్యవేణి, సబ్‌ కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజీం ద్రన్‌, ఐటీడీఏ పీవో సూర్యతేజ, ఆర్డీవో ఝాన్సీరాణి పర్య వేక్షిస్తున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌

కూనవరం మండలంలో పర్యటన ముగిసిన అనంతరం సోమవారం మధ్యాహ్నం 1:40 గంటలకు గొమ్ముగూడెం వస్తారు. రెండు గంటల వరకు ప్రజా ప్రతినిధులతో సమా వేశమవుతారు. 2:20 నుంచి 2:50 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతంలో పరిశీలిస్తారు. 2:55 గంటల నుంచి ఫొటో గ్యాలరీ వీక్షణ, వరద బాధితులతో ముఖాముఖి. 3:30 గంటలకు హెలికాప్టర్‌పై తిరుగు ప్రయాణం.

ఏలూరు చేరుకున్న బాబు

ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి పది గంటలకు ఏలూరు చేరుకున్నారు. కలపర్రు టోల్‌గేటు వద్ద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుచరు లు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఏలూరులో బాబు బస చేసే ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు తీసుకువెళ్లారు. అక్కడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జిల్లా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఘంటా మురళి, బడేటి చంటి తదితరులు స్వాగతం పలికారు. బాబును కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత నాయకులు వెనుతిరిగారు.

నేడు పోలవరం పర్యటన

ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ ‘చింతలపూడి ఎత్తిపోతలకు టీడీపీ హయాంలో రూ.3,500 కోట్లకు పైగా ఖర్చు చేశాం. అందుకే అక్కడకు వెళ్లిన తర్వాత పాత పట్టి సీమ వెళ్తారు. అక్కడ స్థానిక ఫంక్షన్‌ హాల్లో పోలవరంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఆ తర్వాత పోలవ రం ప్రాజెక్టు పరిశీలనార్థం వెళతారు. పరిశీలన తర్వాత స్థానిక ప్రజలను, వరద బాధితులను ఉద్దేశించి బాబు ప్రసంగిస్తారు. అనంతరం దేవరపల్లిలో బహిరంగ సభకు హాజరవుతారు’ అని తెలిపారు.

Updated Date - 2023-08-07T00:41:21+05:30 IST