మొక్కుబడి పనులే ముంచుతున్నాయి

ABN , First Publish Date - 2023-07-27T00:31:27+05:30 IST

చినుకు పడితే చాలు గోదావరి డెల్టాలో అన్న దాతలు ముంపు భయంతో వణికిపోతుంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది.

మొక్కుబడి పనులే ముంచుతున్నాయి
బొండాడ డ్రెయిన్‌ ప్రస్తుత పరిస్థితి ఇదీ..

ఏటా ఆలస్యంగా కాల్వల్లో తూడు, చెత్త తొలగింపు పనులు

భీమవరం, జూలై 26 : చినుకు పడితే చాలు గోదావరి డెల్టాలో అన్న దాతలు ముంపు భయంతో వణికిపోతుంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి ఐదో తేదీ మధ్య కాలువలకు నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే.అప్పుడు ఓఅండ్‌ఎం ప్యాకేజీలో కాలువల్లో తూడు చెత్త తొలగింపునకు రసా యనాలు చల్లడం ఆరంభించారు. నిజానికి పనులు టెండర్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపట్టాలి. మే, జూన్‌ నెలల్లో పూర్తిచేయాలి. ఏటా లాగానే ఈసారి కూడా కాలువలు వదిలాక పనులు చేపట్టారు. కాలువల్లో చూడు, చెత్త తొలగించ డానికి రూ.13 కోట్లు కేటాయించారు. 20 పంట కాల్వలకు రూ.7 కోట్లు, 25 డ్రెయినేజీలకు రూ.6 కోట్ల వంతున ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. చివరి దశలో పనులు ప్రారంభించడంతో పూర్తిస్థాయిలో జరిగే అవకాశం లేదని రైతులు చెబుతువచ్చారు. చివరకు అదే జరిగింది. దీనిపై జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలోనూ, వ్యవసాయ సలహా మండలి సమా వేశంలో కూడా కాల్వలు మూసిన వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పూడూ ముందస్తుగా పనులు చేపట్టలేదు. గతవారం జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కూడా పలువురు రైతులు డ్రెయినేజీలో తూడు చెత్త తొలగింపు సమస్య జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. జలవనులు శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టమని ఆదేశించారు. అయినా తమ మొర అరణ్య రోదనగా మిగులుతోందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2023-07-27T00:31:27+05:30 IST