Eluru Dist.: నేటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-30T09:09:29+05:30 IST
ఏలూరు జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న తిరుమలేశుని వైశాఖమాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఏలూరు జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న తిరుమలేశుని వైశాఖమాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు వచ్చేనెల 7వ తేదీ వరకు జరుగుతాయి. ఈ రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెగాను అలంకరిస్తారు. రాత్రి 8 గంటలకు గజవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. వచ్చే నెల 4న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 5న స్వామి వారి రథోత్సవం, 6న శ్రీచక్రవార్యుత్సవం, ధ్వజావ రోహణ, 7న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్థానిక పాత కల్యాణ మండపం ముందు పాతబస్టాండ్ వద్ద శ్రీవారు, అమ్మవార్ల భారీ విద్యుత్ కటౌట్ ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో విద్యుత్ తోరణాల ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం ముందు తాటియాకుల పందిరిని నిర్మించారు. కాగా బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాధరావు పేర్కొన్నారు.