‘వైసీపీ పాలనలో సామాన్యుడిపై భారం’
ABN , First Publish Date - 2023-01-12T00:31:20+05:30 IST
వైసీపీ పాలనలో సామాన్యులపై మోయలేని భారం పడిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.
కాళ్ళ/ఉండి, జనవరి 11 : వైసీపీ పాలనలో సామాన్యులపై మోయలేని భారం పడిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ల గ్రామంలో, ఉండి మండలం మహదేవపట్నం, ఉండి గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాళ్ల మండలంలో టీడీపీ మండలాధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, కోటి పాండురంగారావు, తోట ఫణిబాబు, కొప్పనీడి గణపతి, ఉపసర్పంచ్ పన్నాసి అబ్బులు, తదితరులు ఉండి మండలంలో సర్పంచ్ వనిమా సుబ్బలక్ష్మి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు వనిమా శ్రీనివాసరావు, కాగిత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.