asp bhaskara rao

ABN , First Publish Date - 2023-05-24T00:22:47+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తానని జిల్లా నూతన అదన పు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు చెప్పారు.

asp bhaskara rao
జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని కలిసిన ఏఎస్పీ భాస్కరరావు

ఏఎస్పీగా భాస్కరరావు

ఏలూరు క్రైం, మే 23 : శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తానని జిల్లా నూతన అదన పు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు చెప్పారు. ఏలూరు జిల్లా ఏర్పడిన తరువాత మొట్ట మొదటి అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ఆయ న మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేప ట్టారు. 1989 ఎస్‌ఐ బ్యాచ్‌నకు చెందిన ఆయన ఏలూరు రేంజ్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేశారు. సీఐగా జిల్లాలోని భీమడోలు స్పెషల్‌ బ్రాంచిలో పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొంది పదేళ్ల పాటు సీఐడీ ఇంటిలిజెన్స్‌, విజయవాడ క్రైం, రాజమహేంద్రవరం క్రైం డీఎస్పీగా పని చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంత రం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందిం చారు. ఆయనను ఏఆర్‌ అదనపు ఎస్పీ శేఖర్‌, ఎస్‌బీసీఐ ఎం.సుబ్బారావు, బీసీఆర్‌ బీ సీఐ దుర్గాప్రసాద్‌, ఏఆర్‌ఆర్‌ఐ ఐ.పవన్‌ కుమార్‌, డీటీఆర్‌బీ ఎస్‌ఐ కె.రాంబాబు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బుద్దాల శ్రీనివాసరావు, ఎస్పీ కార్యాలయ ఏవో చీపురుపల్లి గోపీనాథ్‌ పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-05-24T00:22:47+05:30 IST