ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకే మద్దతు : మాగంటి
ABN , First Publish Date - 2023-03-11T23:48:45+05:30 IST
ప్రజల్లో మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి ప్రజలంతా మద్దతుగా నిలుస్తా రని మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
జంగారెడ్డిగూ డెం/ కామవరపు కోట మార్చి 11 : ప్రజల్లో మార్పు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి ప్రజలంతా మద్దతుగా నిలుస్తా రని మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన ఇద్దరు పిల్లలు చనిపోయినా ప్రజలంతా అండగా ఉండడంతో దైర్యంగా ఉన్నాన న్నారు. రానున్న కాలంలో జిల్లా వాసులు మరో చాన్స్ ఇచ్చి గెలిపిస్తారన్నారు. అనంతరం గుర్వాయిగూడెంలోని పార్టీ మండల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారం లోకి తీసుకొని వచ్చి నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్‌కుమార్, కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు మాగంటి పరామర్శ
కామవరపుకోట మండలం తడికలపూడి మాజీ సర్పంచ్ తమ్మినేని లక్ష్మీనారాయణ సతీమణి బేబి సరోజిని ఇటీవల మృతి చెందగా శనివారం వారి గృహానికి, ఆడమిల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జిజ్జూరి బాబ్జీ మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంలో వారి గృహానికి కూడా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.