క్రీడలతో ఉజ్వల భవిష్యత్ : డీటీసీ డీఎస్పీ ప్రభాకర్
ABN , First Publish Date - 2023-02-05T00:04:36+05:30 IST
క్రీడాకారులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్సోత్సాహ కాలను అందిస్తున్నాయని పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ) డీఎస్పీ కె.ప్రభాకర్ అన్నారు.
పెదవేగి, ఫిబ్రవరి 4 : క్రీడాకారులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్సోత్సాహ కాలను అందిస్తున్నాయని పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ) డీఎస్పీ కె.ప్రభాకర్ అన్నారు. పెదవేగి డీటీసీలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 ఏళ్ల విభాగం సాఫ్ట్‌బాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. సమాజంలో క్రీడలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో రాష్ట్రస్థాయి జట్టులో చోటు సంపాధించడమే లక్ష్యంగా క్రీడాకారులు పోటీ పడాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ పి.విజయబాబు, ఉపరవాణాశాఖాధికారి విజయరాజు, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి డాక్టర్ మరీదు మనోహర్, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జయరాజు, గురుమూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.