Eluru Dist.: ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు హార్ట్ స్ట్రోక్
ABN , First Publish Date - 2023-01-24T15:25:10+05:30 IST
పశ్చిమ గోదావరి (West Godavari): ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Tellam Balaraju)కు ఛాతీ నొప్పి (Heart Stroke) వచ్చింది.
పశ్చిమ గోదావరి (West Godavari): ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Tellam Balaraju)కు ఛాతీ నొప్పి (Heart Stroke) వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమండ్రి (Rajahmundry) సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Sai Super Specialty Hospital)కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు గుండెకు స్టంట్ (Stunt) వేశారు. ప్రస్తుతం తెల్లం బాలరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ (ICU)లో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.