గ్రామ దేవతలకు సారె సమర్పణ

ABN , First Publish Date - 2023-04-22T23:31:02+05:30 IST

కాళ్ళ గ్రామ దేవతలు మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

గ్రామ దేవతలకు సారె సమర్పణ
అమ్మవార్లకు సారె తీసుకువస్తున్న మహిళలు

కాళ్ళ, ఏప్రిల్‌ 22 : కాళ్ళ గ్రామ దేవతలు మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 29 వరకు జాతర కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా అమ్మవార్లకు 400 కేజీలతో తయారు చేయించిన పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ సుమారు 200 మంది మహిళలు సారె బిందెలు, కావిళ్ళతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు సారె సమర్పించారు. భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Updated Date - 2023-04-22T23:31:30+05:30 IST