వైభవంగా కోటి దీపోత్సవం
ABN , First Publish Date - 2023-12-13T00:49:32+05:30 IST
పంచారామ క్షేత్రం మంగళవారం రాత్రి కోటి దీప కాంతులతో దేదీప్యమానమైంది.
భీమవరం టౌన్, డిసెంబరు 12: పంచారామ క్షేత్రం మంగళవారం రాత్రి కోటి దీప కాంతులతో దేదీప్యమానమైంది. సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఘనంగా కోటి దీపోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై క్షేత్ర పాలకుడైన జనార్ధన స్వామితో కలసి సోమేశ్వర స్వామి ఆశీనులవగా అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవంలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయ ప్రాంగణం శోభాయమానమైంది.