డెంగీ నిర్ధారణ ల్యాబ్‌ తనిఖీ

ABN , First Publish Date - 2023-02-18T00:10:02+05:30 IST

తణుకు కేంద్ర ఆస్పత్రిలోని డెంగీ నిర్ధారణ ల్యాబ్‌ను జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి శుక్రవారం తనిఖీ చేశారు.

డెంగీ నిర్ధారణ ల్యాబ్‌ తనిఖీ
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిబ్బందికి సూచనలిస్తున్న దృశ్యం

తణుకు, ఫిబ్రవరి 17: తణుకు కేంద్ర ఆస్పత్రిలోని డెంగీ నిర్ధారణ ల్యాబ్‌ను జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు సూచనలిచ్చారు. అనంతరం తణుకులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి ఒకే రూంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం సరికాదని, వసతి గృహంలో పరిశుభ్రత సరిగా లేనందున నివేదిక ఇవ్వాలని కొమ్మాయిచెర్వు గట్టు అర్బన్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగభూషణాన్ని ఆదేశించారు. సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వరరావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-18T00:10:06+05:30 IST