మానవాళి సంక్షేమమే వాటికన్‌ సందేశం

ABN , First Publish Date - 2023-03-24T00:17:59+05:30 IST

ప్రపంచ మానవాళి సంక్షేమమే వాటికన్‌ సందేశమని వాటికన్‌ రాయబారి లియోపోర్డ్‌ జెరెల్లి అన్నారు.

మానవాళి సంక్షేమమే వాటికన్‌ సందేశం
లియోపోర్డ్‌ జెరెల్లిని సన్మానిస్తున్న బిషప్‌, పాస్టర్లు

రాయబారి లియోపోర్డ్‌ జెరెల్లి ఏలూరు రాక

ఏలూరు టూటౌన్‌, మార్చి 23: ప్రపంచ మానవాళి సంక్షేమమే వాటికన్‌ సందేశమని వాటికన్‌ రాయబారి లియోపోర్డ్‌ జెరెల్లి అన్నారు. గురువారం ఏలూరు బిషప్స్‌ హౌస్‌కు ఆయన విచ్చేశారు. ఏలూరు కథోలిక పీఠాధిప తులు మోస్ట్‌ రెవరెండ్‌ పొలిమేర జయరావు ఆహ్వానం పలికారు. అనంతరం బిషప్స్‌ హౌస్‌లో పలువురు పురప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బిషప్‌ జయరావు మాట్లాడుతూ భిన్న మతాల, భిన్న సంస్కృతుల సమ్మేళనమే మన భారతదేశమని అన్నారు. నగర మేయర్‌ దంపతులు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు నగర ప్రజలపై మెండైన ఆశీస్సులు అందించాలని వాటికన్‌ రాయభారిని కోరారు. టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం ఇటువంటి విశిష్ట సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గారపాటి చౌదరి మాట్లాడుతూ శాంతితో కూడిన ఆరోగ్యవంతమైన సమాజానికి ఈ వేదిక ఎంతో అవసరం అన్నారు. మాజీ అనంతరం ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త లునాని మాట్లా డారు. మహావీర్‌ జయంతి సందర్భంగా వాటికన్‌ సిటీ నుంచి తీసుకువచ్చిన సందేశాన్ని జైన్‌ సంఘ నాయకులు విజయకుమార్‌ జైన్‌కు స్వయంగా రాయభారి జిరెల్లి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా శామ్యూల్‌ పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్‌, నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ దిరిశాల వరప్రసాద్‌, జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-24T00:17:59+05:30 IST