Share News

ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలి

ABN , First Publish Date - 2023-12-01T00:31:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు రూ.10,600 కోట్లు వెంటనే తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ జిల్లా అదక్షుడు కడలి గోపాలరావు డిమాండ్‌ చేశారు.

ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలి
పూలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీ రాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు కడలి గోపాలరావు

పాలకొల్లు రూరల్‌, నవంబరు, 30 : రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు రూ.10,600 కోట్లు వెంటనే తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ జిల్లా అదక్షుడు కడలి గోపాలరావు డిమాండ్‌ చేశారు. గురువారం పూలపల్లి అంబేడ్కర్‌ కమ్యూనిటీలో పాలకొల్లు నియో జకవర్గ సర్పంచుల సంఘం అద్యక్షుడు తాళ్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలరావు పాల్గొని మాట్లాడారు. సచివాలయాలను, వలంటీర్ల వ్యవస్థను పంచాయతీలలో విలీనం చేయాలని సర్పంచ్‌లకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలన్నారు. డిసెంబరు 11వ తేదీన కాకినాడలో జోన్‌2 పరిధిలో సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డు సభ్యులకు మాజీలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అడబాల చిట్టిబాబు, కొండేటి జీవరత్నం, ఈద ప్రమీల, రత్నరాజు, ఆకుల ధనలక్ష్మి, కవురు నాగలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-01T00:31:08+05:30 IST