కొంతేరులో 28 నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు
ABN , First Publish Date - 2023-04-23T23:38:16+05:30 IST
కొంతేరు గ్రామంలో యూత్‌క్లబ్ నాటక పరిషత్ ఆఽధ్వర్యంలో 41వ అఖిల భారతస్థాయి నాటికల పోటీలను ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు తెలిపారు.
యలమంచిలి, ఏప్రిల్ 23: కొంతేరు గ్రామంలో యూత్‌క్లబ్ నాటక పరిషత్ ఆఽధ్వర్యంలో 41వ అఖిల భారతస్థాయి నాటికల పోటీలను ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు తెలిపారు. పరిషత్ కార్యాలయంలో ఆది వారం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాటిక పోటీల బ్రోచ ర్లను ఆవిష్కరించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ, పోటీలను యూత్‌క్లబ్ కళామందిర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28న గంగోత్రి పెదకాకాని వారి ’పేగురాసిన శాసనం’, శ్రీసాయికార్తీక క్రియేషన్స్ కాకినాడ వారి ‘ఎడారిలో వాన చినుకు’, 29న శ్రీహర్షక్రియేషన్స్ విజయవాడ వారి ‘స్వర్ణకమలాలు’, శ్రీఅమృతలహరి థియేటర్ ఆర్ట్స్ గుంటూరు వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’, కళాంజలి హైదరాబాద్ వారి ‘రైతే రాజు’, 30న శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘ప్రేమతో నాన్న..’, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటికలను ప్రదర్శిస్తారని వివరించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు.