ప్రతి ఉద్యోగి ప్రజా సేవకుడే
ABN , First Publish Date - 2023-08-30T00:41:56+05:30 IST
సచివాలయానికి వచ్చే ప్రజల అవసరా లను, సమస్యలను ఓపికగావిని చేయగలిగింది చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ఏలూరు కలెక్టరేట్, ఆగస్టు 29 : సచివాలయానికి వచ్చే ప్రజల అవసరా లను, సమస్యలను ఓపికగావిని చేయగలిగింది చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గ్రేడ్ –1 నుంచి గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి ప్రజా సేవకుడు అనే విషయాన్ని మరవకూడదన్నారు. సచివాలయంలో కార్యదర్శులు అందుబాటు లో లేరనేమాట వినపడకూడదన్నారు. డీపీవో తూతిక విశ్వనాఽథ్ మాట్లాడు తూ, పంచాయతీ పరిపాలనకు సంబంధించి ఆరుఅంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 821 మందికి నాలుగు బ్యాచ్‌లుగా ఆరు అంశాలపై శిక్షణనిచ్చారు. అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, శిక్షణ కో ఆర్డినేటర్ ప్రసంగిరాజు, కోఆర్డినేటర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.