Share News

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2023-12-11T23:31:25+05:30 IST

తుఫాన్‌ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ర్టానికి తక్షణమే రూ.1000 కోట్లు కేటాయించాలని రాజకీయ ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఐక్యత చాటుతున్న ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల నేతలు

రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 11 : తుఫాన్‌ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ర్టానికి తక్షణమే రూ.1000 కోట్లు కేటాయించాలని రాజకీయ ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. రాజకీయ నాయకులు, రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తడిచిన ధాన్యం ఏ స్థితిలో ఉన్న ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తుఫాన్‌ వల్ల అధిక వర్షపాతం నమోదైన 470 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. అన్ని పంటలకు బీమా వర్తింప చేయాలని, పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. రైతుల సమస్యలపై ఈనెల 14న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఆర్‌.లక్ష్మణరావు, బద్దా వెంకట్రావు, యూ.హేమశంకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వెంక టేశ్వరరావు, జనసేన, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T23:31:26+05:30 IST