80శాతం రక్షణ ఉత్పత్తులు దేశంలోనే తయారీ

ABN , First Publish Date - 2023-02-26T00:09:32+05:30 IST

భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వృద్ధి సాధించి విదేశాలకు కూడా రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్త, ఎస్‌ఆర్‌కేఆర్‌ పూర్వ విద్యార్థి డాక్టర్‌ బీవీ రవికుమార్‌ పేర్కొన్నారు.

80శాతం రక్షణ ఉత్పత్తులు దేశంలోనే తయారీ
మాట్లాడుతున్న డీఆర్డీవో సైంటిస్టు డాక్టర్‌ రవికుమార్‌

భీమవరం ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 25 : భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వృద్ధి సాధించి విదేశాలకు కూడా రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్త, ఎస్‌ఆర్‌కేఆర్‌ పూర్వ విద్యార్థి డాక్టర్‌ బీవీ రవికుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాలలో శనివారం పూర్వవిద్యార్థుల సహకారంతో రెండు రోజుల పాటు జరిగే అపూర్వ 23 వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రక్షణ రంగానికి సంబంధించి 80శాతం ఉత్పత్తులు భారత్‌లోనే తయారవుతున్నాయని ఇదంతా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్బర్‌ భారత్‌ స్ఫూర్తిదాయకమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డీఆర్డీవో తయారు చేసిన డీ2జీ డ్రగ్‌ కరోనా నివారణకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు కోర్‌ గ్రూప్‌కు ప్రాధాన్యత ఇచ్చి విస్తృతమైన పరిశోధనలకు ముందుకు రావాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా త్రిబుల్‌ఈ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో క్రానికల్‌ సావనీరును డాక్టర్‌ రవికుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ రవికుమార్‌ను కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్వీ రంగరాజు, ప్రిన్సిపాల్‌ డా.ఎం.జగపతిరాజు ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-02-26T00:09:36+05:30 IST