డీఆర్‌డీఏ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
ABN , First Publish Date - 2023-07-26T00:06:18+05:30 IST
డీఆర్‌డీఏలో నిధుల దుర్వినియో గంపై అందిన ఫిర్యాదు మేరకు విజయవాడ సొసైటీ ఫర్ ఎలి మినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ (సెర్ప్) ప్రాజెక్టు డైరెక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో బృందం మంగళవారం విచారణ చేశారు.
విజయవాడ సెర్ప్ బృందం తనిఖీలు
భీమవరం రూరల్, జూలై 25 : డీఆర్‌డీఏలో నిధుల దుర్వినియో గంపై అందిన ఫిర్యాదు మేరకు విజయవాడ సొసైటీ ఫర్ ఎలి మినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ (సెర్ప్) ప్రాజెక్టు డైరెక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో బృందం మంగళవారం విచారణ చేశారు. మండలాలకు సంబంధించిన ఏపీఎంలను పిలిపించి వివరాలు అడిగారు. ఆడిట్‌ను గవర్నమెంట్ ఆడిటర్లతో కాకుండా ప్రైవేటు వారితో చేయించడంతోపాటు డ్వాక్రా సంఘాల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంపై విచారణ జరిగినట్లు సమాచారం. మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించే విషయంలో కమీషన్ల వసూలుకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపైన వివరాలు సేకరించారు.