పాత బస్టాండ్‌లో పెచ్చులూడిన స్లాబ్
ABN , First Publish Date - 2023-05-16T00:42:02+05:30 IST
ఏలూరు పాతబస్టాండ్‌లో సోమవారం స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో ఆరుగురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యా యి.
ఏలూరు క్రైం, మే 15: ఏలూరు పాతబస్టాండ్‌లో సోమవారం స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో ఆరుగురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యా యి. పాతబస్టాండ్ శిథిలావస్థలో ఉన్నప్పటికీ మరమత్తులు చేపట్టకపోవ డంతో తరచూ పెచ్చులు ఊడిపడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఎండను తట్టుకోలేక ప్రయాణీకులు బస్టాండ్ లోపల కూర్చున్నారు. అక స్మాత్తుగా స్లాబ్ సన్‌సైడ్ పెచ్చులు ఊడిపడిపోయాయి. దీంతో పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన ఎస్. వెంకటేశ్వరమ్మ, సుబ్బలక్ష్మి మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది వెళ్లిపోయారు.