రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2023-01-08T23:41:43+05:30 IST

రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన కొనసాగుతుందని, త్వరలోనే జగన్‌ను గద్దె దింపి ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌ అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
కొమ్ముచిక్కాలలో ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల ధ్వజం

పోడూరు, జనవరి 8: రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన కొనసాగుతుందని, త్వరలోనే జగన్‌ను గద్దె దింపి ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌ అన్నారు. మండలంలోని కొమ్ముచిక్కాలలో టీడీపీ శ్రేణులతో ఆదివారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, జగన్‌ పాలనపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను నమోదు చేసుకున్నారు. గొట్టుముక్కల రఘురామరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, నాగరాజు సుజాత రామకృష్ణంరాజు, జుత్తిగ దుర్గ, గుంటూరి కళ్యాణి, మేడిశెట్టి బుజ్జి, కొసన అబ్బులు, నాగరాజు చిన్నా, గుంటూరి రాజా, దాసరి రత్నరాజు, పాలవలస తులసీరావు, కెఎస్‌ఎన్‌.రాజు, కుక్కల మునీంద్రరావు, గుడాల సత్యనారాయణ, భేతాళం సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు / రూరల్‌: ఒక్కఛాన్సు అంటూ అధికారం చేపట్టి నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ నవ మోసాలు చేస్తున్నాడని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇదేం ఖర్మలో భాగంగా ఆదివారం ఎనిమిదో వార్డులో బొల్లా వీరశ్వేత, బొల్లా వెంకట్రావు నేతృత్వంలో రాక్షస పాలన వివరించారు. వివిధ నిబంధనల పేరుతో పింఛన్లు తొలగించి వైసీపీ కార్యకర్తలకు కొత్తగా ఇస్తూ అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తుగ్లక్‌ పాలకుడిని జనం ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మోటుపల్లి రామవర ప్రసాద్‌, గంధం ఉమా, కౌన్సిలర్‌ బత్తుల శ్యామల, బొర్రా సుజాత, జాకీర్‌, ఎం.నోబుల్‌, ఇల్లాపు అప్పారావు, శ్రీను, పెద్ది రాజు, తదితరులు ఉన్నారు.

అజ్జమూరులో జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్‌ మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా పరిపాలన సాగుతుందన్నారు. పాలకులకు తగిన బుద్ధి చెప్పడనాకి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. నౌకట్ల రామారావు, బచ్చు కృష్ణారావు, ఇల్లాపు అప్పారావు, మజ్జి సత్యనారాయణ, బాబూరావు, హనుమంతు, అజమాల్‌, అయ్యప్ప, రత్నాజీ, తోట శ్రీను పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా గ్రామా ల్లో రోడ్లకు మోక్షం లేదని, దానికి నిదర్శనం నవరసపురం రోడ్డేనని టీడీపీ ఇన్‌ చార్జి పొత్తూరి రామరాజు అన్నారు. హామీలే తప్ప ప్రభుత్వం ఎటువంటి అభి వృద్ధి చేపట్టలేదన్నారు. మూడేళ్లుగా గ్రామాల రహదార్లు గోతులమయమైనా పాలకులకు చీమకుట్టినట్లయిన లేకపోవడం దారుణమన్నారు. పథకాలతో మభ్యపెట్టి పన్నుల రూపంలో దోచుకుంటున్న ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వాతాడి ఉమా, జక్కం శ్రీమన్నారాయణ, రామకృష్ణ, ధనకు మార్‌, భాగ్యనందం, రామచంద్రమూర్తి, జాన్‌కుమారి, సంధ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T23:41:45+05:30 IST