Dwarakathirumala: ద్వారకాతిరుమలలోని చిన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలోని అశ్వం మృతి
ABN , First Publish Date - 2023-04-01T00:04:48+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమలలో (Dwarakathirumala) గల చిన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి (Venkateswara Swamy temple) చెందిన అశ్వాలలో ఓ అశ్వం జన్మనిచ్చి అనారోగ్యం పాలై శుక్రవారం సాయంత్రం యోగిని(Yogini) అనే అశ్వం మృతిచెందింది.
ఏలూరు(Eluru): జిల్లాలోని ద్వారకాతిరుమలలో (Dwarakathirumala) గల చిన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి (Venkateswara Swamy temple) చెందిన అశ్వాలలో ఓ అశ్వం జన్మనిచ్చి అనారోగ్యం పాలై శుక్రవారం సాయంత్రం యోగిని(Yogini) అనే అశ్వం మృతిచెందింది. గురువారం మరో అశ్వానికి యోగిని జన్మనించింది. అప్పటి నుంచి యోగిని అశ్వం అనారోగ్యానికి గురయింది. జన్మనిచ్చే సమయంలో మేయ బయటికి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పశు వైద్యులు తెలిపారు.
దేవస్థానం నిర్వాహకులు ఈ అశ్వాలను స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఊరేగింపుల సమయంలో ఉపయోగిస్తారు. అయితే గతంలో కూడా అధికారులు వైద్యులు పర్యవేక్షణ లోపంలో ఒక అశ్వం మృతి చెందింది. ఇలా అశ్వాలు మృతి చెందడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు తీరు మార్చుకోవాలని భక్తులు కోరుతున్నారు.