చీడపీడల నియంత్రణకు సేంద్రియ పద్ధతులే మేలు

ABN , First Publish Date - 2023-01-17T23:24:19+05:30 IST

చీడపీడల నియంత్రణకు సేంద్రియ పద్ధతులే మేలని ఐపీఎఫ్‌టీ, గురుగావ్‌ సంచాలకులు డాక్టర్‌ జితేంద్ర పేర్కొన్నారు.

చీడపీడల నియంత్రణకు సేంద్రియ పద్ధతులే మేలు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 17: చీడపీడల నియంత్రణకు సేంద్రియ పద్ధతులే మేలని ఐపీఎఫ్‌టీ, గురుగావ్‌ సంచాలకులు డాక్టర్‌ జితేంద్ర పేర్కొన్నారు. వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పురుగుమందుల సూత్రీకరణ నియంత్రణ సంస్థ (ఐపీఎఫ్‌ టీ) సంయుక్తంగా మన పరిసర ప్రాంతాల్లో లభించే వృక్ష ఆధారిత పురుగు మందుల తయారీ, సేంద్రియ వ్యవసాయం సస్యరక్షణతో పంట ఉత్పాదకత పెంపుపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత జ్యోత్విప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పురుగులు వాటి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం వల్ల పురుగు మందులు పనిచేయడం లేదని వాటికి సేంద్రియ పద్ధతే సరైనదన్నారు. ఉపకులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ మాట్లాడుతూ జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం వల్ల ప్రపంచ వాణిజ్య రంగంలో మన దేశ ఉత్పత్తులకు మంచి ధర సాధించవచ్చన్నారు. ఈ సందర్బంగా ఐఏఆర్‌ఐ న్యూఢిల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఏ షకీర్‌, ఐపీఎఫ్‌టీ గురుగావ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శుభమ్‌ యాదవ్‌, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:24:20+05:30 IST