ఎక్కడి చెత్త అక్కడే..
ABN , First Publish Date - 2023-03-27T00:01:34+05:30 IST
నగర పాలక సంస్థ పరిధిలోని నాగేంద్ర కాలనీ చెత్తకుప్పలు, మురుగు డ్రెయిన్లతో కంపు కొడుతోంది.
కదలని మురుగుతో దుర్వాసన
గోతులు పడిన రహదారులు
నాగేంద్ర కాలనీవాసుల గగ్గోలు
ఏలూరు కార్పొరేషన్, మార్చి 26: నగర పాలక సంస్థ పరిధిలోని నాగేంద్ర కాలనీ చెత్తకుప్పలు, మురుగు డ్రెయిన్లతో కంపు కొడుతోంది. కాలనీలో గుంతల రహదా రులు, అధ్వాన పారిశుధ్యం, అస్తవ్యస్త డ్రైనేజీలతో స్థానికులు ఇబ్బందులు పడు తున్నారు. డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం, ప్లాస్టిక్ గ్లాస్‌లు, కవర్లు, వ్యర్థాలతో మురుగు నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. స్థానికులు దుర్వాసన, దోమలతో వ్యాధులబారిన పడుతున్నారు. డ్రైనేజీలు పర్యవేక్షణ లేకపోవడంతో మురుగు పేరు కుపోతుంది. పాలకులు తగు చర్యలు తీసుకుని మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని, మురుగునీరు ఎక్కడా నిల్వ లేకుండా అవుట్‌లెట్‌కు వెళ్లేవిధంగా ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిం చాలని కోరుతున్నారు. వ్యర్థాలు, చెత్తకుప్పలు సచివాలయం–3 సమీపంలోనే ఉండ డం, మురుగునీటి కాల్వలు పూర్తిగా నిలిచి ఉండడం గమనార్హం. అనారోగ్యం పాలు కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నారు. రహదారులు గోతు లు పడి ప్రమాదభరితంగా మారాయి. స్థానికంగా రాకపోకలకు సైతం అనువుగా లేదని వాపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు దృష్టి కేంద్రీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
కాలనీలోని డ్రెయిన్లలో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన వస్తుందని స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించు కున్న నాథుడు లేడు. దోమలు పెరగడంతో అనారోగ్యం పాలవుతున్నాం. డ్రైనేజీల్లో పూడికలు తీయించి, వ్యర్ధాలు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
జి.లక్ష్మి, స్థానికురాలు
కాలనీ సమస్యలపై దృష్టి పెట్టండి
కాలనీవాసులు అనారోగ్యం బారిన పడకముందే వైద్య బృందం, పారిశుధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు ఉండే విధంగా చూడాలి. రోడ్లపై గోతులను పూడ్చాలి. రాకపోకలకు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
కోలా లక్ష్మి, స్థానికురాలు