అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2023-07-16T00:34:01+05:30 IST

ప్రభుత్వ నవరత్నాల పథకాల ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేశ్‌ కోరారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ద్వారకాతిరుమల, జూలై 15: ప్రభుత్వ నవరత్నాల పథకాల ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేశ్‌ కోరారు. తిమ్మాపురంలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమఫలాలు నేరుగా అందించాలన్నది ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. మండలంలో రోడ్లు, డ్రెయినే జీలను నిర్మించాలని ఎమ్మెల్యే కోరారని వాటిని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే తలారి మాట్లాడుతూ, 442 దరఖాస్తులందాయని వాటిని పరిష్కరిస్తా మన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. జడ్పీటీసీ సీహెచ్‌ శామ్యూల్‌, చెలికాని రాజబాబు, బొండాడ వెంకన్నబాబు, జంగా కృష్ణారెడ్డి, భోగరాజు చిన్ని, గుర్రాల లక్ష్మణ్‌, ఎంపీటీసీ సరిత, ఎంపీడీవో సుబ్బరాయన్‌, తహసీల్దార్‌ సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-16T00:34:01+05:30 IST