క్వార్టర్‌పై రూ. 50 బాదుడు

ABN , First Publish Date - 2023-01-04T00:00:49+05:30 IST

మద్యపానప్రియుల జేబుకు చిల్లుపడుతోంది. బ్రాండెడ్‌ రకాల మద్యం ప్రభుత్వ దుకాణాల్లో లభ్యం కావడం లేదు.

క్వార్టర్‌పై రూ. 50 బాదుడు

బార్‌ యాజమానులు సిండికేట్‌

అదనపు సొమ్ము వసూళ్లు

బయటకు విక్రయిస్తే చట్ట విరుద్ధం

అయినా పట్టించుకోని వైనం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మద్యపానప్రియుల జేబుకు చిల్లుపడుతోంది. బ్రాండెడ్‌ రకాల మద్యం ప్రభుత్వ దుకాణాల్లో లభ్యం కావడం లేదు. బార్‌లలోనే నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. మందు బాబులు బ్రాండెడ్‌ రకాల కోసం ఎగబడుతున్నారు. బార్ల పైనే ఆధార పడుతున్నారు. అక్కడే నిలువుదోపిడీ సాగు తోంది. జిల్లాలో పలువురు బార్‌ యాజమానులు సిండికేట్‌ అయ్యారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ని బంధనల మేరకు బార్‌లలో అధిక ధరలకు విక్రయిం చుకునే వెసులుబాటు ఉంది. ఆ నిబంధనే బార్‌లకు కాసు ల వర్షం కురిపిస్తోంది. క్వార్టర్‌ బాటిల్‌పై అదనంగా రూ. 50 వసూలు చేస్తున్నారు. అదే హాఫ్‌ బాటిల్‌ అయితే రూ. 100, ఫుల్‌ బాటిల్‌కు రూ.200 బాదేస్తున్నారు. బార్‌లలో హాఫ్‌, ఫుల్‌ బాటిళ్లు మాత్రమే బయటకు విక్రయించాలి. క్వార్టర్‌ బాటిళ్లు బయటకు అమ్మకాలు సాగించకూడదు. బయటకు విక్రయిస్తేనే చట్ట విరుద్ధం. ఇప్పుడదే జరుగు తోంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు పట్టణాల్లో 26 బార్‌లు ఉన్నాయి. ప్రతి బార్‌లోనూ బయటకు బాటిళ్ల విక్రయిస్తున్నారు.

బార్‌లపైనే ఆధారం..

మద్యం ప్రియులు నాణ్యమైన మద్యాన్ని తాగేందుకు బార్‌లపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకా ణాలు ఉన్నా బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా మ్యాన్సన్‌ హౌస్‌, రాయల్‌ స్ర్టాగ్‌, రాయ ల్‌ గ్రీన్‌ వంటి బ్రాండెడ్‌ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో సర ఫరా కావడం లేదు. బార్‌లలో మాత్రం నిత్యం సరఫ రా అవుతున్నాయి. ఆ మతలబు ఏమిటో మద్యపాన ప్రియులకు అంతుబట్టడం లేదు. నాణ్యత లేని చీఫ్‌ లిక్కర్‌ మాత్ర మే మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నా రు. ధరలు గతం కంటే రెండింతల య్యాయి. గతంలో రూ.70లకు లభ్య మయ్యే చీఫ్‌ లిక్కర్‌ ధర ఇప్పుడు రెట్టింపయ్యింది. అయినా కావాల్సిన బ్రాండ్‌లో లభించడం లేదు. దాంతో బార్‌లపైనే మద్యపాన ప్రియులు ఆధారపడుతూ అదనపు సొమ్ములు చెల్లించి కొంటున్నారు. భీమవరం, తణుకు తదితర పట్టణాల్లో బ్రాండెడ్‌ రకాలపై మోజు చూపుతుం టారు. మద్యం దుకాణాల్లో లభించకపోతే బార్‌లలోనే కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఆశించిన స్థాయిలో సరఫరా చేయడం లేదు. అధికార పార్టీ సానుభూతి పరులకు చెందిన కంపెనీల నుంచి మద్యాన్ని అధికంగా సరఫరా చేస్తున్నారన్న విమర్శలు సర్వసాధారణ మైపోయాయి. మద్యం దుకాణాల్లో ఏ రాష్ట్రంలో లేని రకాలు అందుబాటులో ఉంచుతున్నారు. అవేమన్నా బ్రాండెడ్‌ అనుకుంటే పొర పాటు పడినట్టే. ఒక దశలో బ్రాండెడ్‌ రకాలను సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో తుస్సుమంటోంది.

ప్రైవేటులో పోటీ..

గతంలో ప్రైవేటు షాపులు ఉండేవి. నిర్వాహకులు పోటీ పడి నాణ్యమైన రకాలను అందుబాటులో ఉంచే వారు. అప్పట్లో లైసెన్స్‌ దారులు సిండికేట్‌ అయినా బాటిల్‌పై రూ.10 అదనంగా వేసి విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తేవి. ప్రభుత్వం ప్రైవేటు షాపులను తీసుకొస్తామంటూ సంకేతాలు ఇచ్చినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మద్యం ప్రియులంతా బార్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Updated Date - 2023-01-04T00:00:50+05:30 IST