Viveka Murder Case : ఎంపీ అవినాష్‌‌ను CBI అధికారులు ఏమేం ప్రశ్నిస్తున్నారు.. లాయర్‌లను అనుమతించారా..!?

ABN , First Publish Date - 2023-01-28T16:42:52+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి..

Viveka Murder Case : ఎంపీ అవినాష్‌‌ను CBI అధికారులు ఏమేం ప్రశ్నిస్తున్నారు.. లాయర్‌లను అనుమతించారా..!?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట హాజరయ్యారు. అవినాష్ వెంట భారీగా అనుచరులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సీబీఐ ఆఫీస్ (CBI Office) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం 3గంటలకు అధికారుల ఎదుట ఎంపీ హాజరయ్యారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ (CBI SP Ramsingh) ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. మరోవైపు.. ఆయన తరపు లాయర్‌లను (Lawyers) విచారణ గదిలోకి సీబీఐ అనుమతించలేదు. న్యాయవాది సమక్షంలో సీబీఐ విచారణ జరగాలని మొదట్నుంచీ అవినాష్‌తో పాటు వైసీపీ నేత (YSRCP Leaders) లు డిమాండ్ చేస్తున్నారు.

ఏమేం అడుగుతున్నారు..!?

అవినాష్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ ఫోన్ కాల్ డేటా(Phone Call Data) , లావాదేవీలపై సీబీఐ ఆరాతీస్తోంది. ముఖ్యంగా.. ఈ కేసులో దాదాపు రూ. 40 కోట్ల వ్యవహారానికి సంబంధించిన ఫండింగ్.. అలాగే ఆధారాలను ట్యాంపరింగ్ (Tampering) చేశారని వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘంగా సీబీఐ అధికారులు (CBI Officers) విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో పాటు హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారుపై కూడా సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సీబీఐ దర్యాప్తు ప్రారంభించాక సీన్ రీకన్స్ట్రక్షన్లో (scene reconstruction) లభించిన అధారాలపై ఎంపీని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్‌లు (statements) చాలా కీలకంగా ఉన్నాయి. అవినాష్ స్టేట్మెంట్‌ను అధికారులు వీడియో తీస్తున్నారు. సీబీఐ ఆఫీసుకు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు (koramutla sreenivasulu), ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (MLA Srikanth Reddy) కూడా వచ్చారు.

కడిగిన ముత్యంలా..!

సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసుకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజానిజాలు తెలియాలంటే విచారణ సమయంలో సీబీఐ అధికారులు తీసిన వీడియోలను బయటపెట్టాలన్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకి వస్తారని చెప్పుకొచ్చారు. సీబీఐను (CBI) తమ ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తుకైనా ఆహ్వానించిందన్నారు. రెండున్నరేళ్లుగా అవినాష్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీబీఐ విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు ఎమ్మెల్యే. ప్రతిపక్ష పార్టీలు కుట్ర పురితంగానే అవినాష్ రెడ్డి (YSRCP MP) పేరు వచ్చిందని విప్ మండిపడ్డారు.

విచారణకు ముందు..!

సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయలక్ష్మితో (YS Vijayalakshmi) 15 నిమిషాలపాటు అవినాష్ భేటీ (Meeting) అయ్యారు. అనంతరం వెనుక గేటు ద్వారా సీబీఐ కార్యాలయంలోకి (CBI Office) వెళ్లారాయన. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసు విచారణ (investigation) పారదర్శకంగా జరగాలన్నారు. సీబీఐ విచారణ వీడియో రికార్డింగ్ (Video Recording) చేసేందుకు అనుమతించాలని అధికారులను కోరారు. తనవెంట న్యాయవాదులను కూడా అనుమతించాలని ఎంపీ కోరారు. కాగా.. రెండున్నరేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, నిందితులు, సాక్షులుగా ఉన్నవారిని సీబీఐ సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ ఇంత వరకు విచారణ జరపలేదు. మొదటిసారిగా ఎంపీని అధికారులు విచారిస్తున్నారు.

Updated Date - 2023-01-28T16:50:41+05:30 IST