Bhumana : భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన వైఎస్ జగన్
ABN , First Publish Date - 2023-07-17T16:18:49+05:30 IST
తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) కీలక పదవి కట్టబెట్టారు. భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు...
అమరావతి : తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) కీలక పదవి కట్టబెట్టారు. భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈ సభ్యుల్లో ఒకరు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని కూడా ఉన్నారు. అసెంబ్లీ జాయింట్ కమిటీలను జగన్ ప్రభుత్వం నియమించింది. 9 జాయింట్ కమిటీలు నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవులతో వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ ప్రకటనకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) తిరుపతి పర్యటనపై భూమన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్ దండయాత్రకు దాడికి దిగుతున్నట్టు ఉందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం పేరుతో పవన్ ఇలా చేయడం సబబు కాదన్నారు. జనసేనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో చెప్పకుండా నిత్యం పగ, ప్రతీకారాలతో పవన్ కల్యాణ్ భీష్మ ప్రతిజ్ఞలు చేస్తునన్నారని భూమన మండిపడ్డారు.